ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దు వివాదం.. మోదీని కలుసుకోనున్న అసోం సీఎం

ABN, First Publish Date - 2021-08-09T00:43:10+05:30

ప్రధాని మోదీతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ సోమవారం సమావేశం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ సోమవారం సమావేశం కానున్నారు. అసోం-మిజోరాం సరిహద్దుల వ్యవహారం, ఈశాన్య ప్రాంతాల్లో శాంతి పునరుద్ధరణపై చర్చించనున్నారు. శర్మతో పాటు అసోం బీజేపీ ఎంపీలు కూడా మోదీని కలుసుకోనున్నారు. శనివారంనాడే ఢిల్లీకి వచ్చిన శర్మ కారణాంతరాల వల్ల హోం మంత్రిని అమిత్‌షాను కలుసుకోలేకపోయారు. సరిహద్దుల వివాదంపై మిజోరం, అసోం మధ్య గత నెలలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. జూలై 26న ఇరు రాష్ట్రాల బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో ఆరుగురు అసోం పోలీసులు, ఒక పౌరుడు మరణించారు. దీంతో పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్రం జోక్యంతో సరిహద్దు ప్రాంతాల్లో తటస్థ బలగాల పెట్రోలింగ్‌ ఏర్పాటుకు అంగీకారం తెలుపుతూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రకటన చేశాయి.

Updated Date - 2021-08-09T00:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising