ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాలిన్‌ను ఓడిస్తా! : హిజ్రా అప్సరారెడ్డి

ABN, First Publish Date - 2021-03-03T13:24:02+05:30

కొళత్తూరు నియోజకవర్గంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను ఓడిస్తానని అన్నాడీఎంకే ప్రచార కార్యకర్త, హిజ్రా అప్సరారెడ్డి శపథం చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై(ఆంధ్రజ్యోతి): కొళత్తూరు నియోజకవర్గంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను ఓడిస్తానని అన్నాడీఎంకే ప్రచార కార్యకర్త, హిజ్రా అప్సరారెడ్డి శపథం చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా కొళత్తూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా అప్సరారెడ్డి మాట్లాడుతూ.. అన్నాడీఎంకే అధిష్ఠానం ఆదేశిస్తే కొళత్తూరు నియోజకవర్గంలో పోటీ చేసి స్టాలిన్‌ను ఓడిస్తానని తెలిపారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగాలని ప్రజలంతా ఆశపడుతున్నారని, స్టాలిన్‌ అదేపనిగా ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి ఎడప్పాడిపైనా పసలేని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అన్నాడీఎంకే ప్రభుత్వం తన లాంటి హిజ్రాలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. స్టాలిన్‌ను ఓడించే శక్తి సామర్థ్యాలు తనకు మాత్రమే ఉన్నాయని ఆమె చెప్పారు.

Updated Date - 2021-03-03T13:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising