ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంతం నెగ్గించుకున్న రాహుల్..

ABN, First Publish Date - 2021-10-06T21:05:42+05:30

పంతం నెగ్గించుకున్న రాహుల్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీని పోలీసులు అడ్డుకోవడంతో బుధవారం మధ్యాహ్నం లక్నో విమానాశ్రయంలో తలెత్తిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. రాహుల్ తన సొంత వాహనంలో లఖింపూర్ కేరి వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంతో రాహుల్ బైఠాయింపు నిరసన విరమించారు. అనంతరం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి, సొంత వాహనంలో అక్కడ్నించి బయలుదేరారు. దీనికి ముందు విమానాశ్రయంలో రాహుల్‌ను పోలీసు సిబ్బంది అడ్డుకుంది. తమ పోలీసు వాహనంలోనే వెళ్లాలని షరతు పెట్టింది. ఇందుకు రాహుల్ నిరాకరిస్తూ, తన సొంత వాహనంలోనే వెళ్తానంటూ బైఠాయింపు నిరసనకు దిగారు. రాహుల్‌తో పాటు ఆయన వెంట ఉన్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్, పంజాబ్ సీఎం ఛన్నీ కూడా బైఠాయించారు. ఎట్టకేలకు దిగి వచ్చిన పోలీసులు సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతించడంతో రాహుల్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. లఖింపూర్‌లో గత ఆదివారంనాడు చెలరేగిన హింసాకాండలో చనిపోయిన కుటుంబాలను రాహుల్ పరామర్శించనున్నారు.

Updated Date - 2021-10-06T21:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising