ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ అల్లర్ల కేసు.. ముగ్గురు ఉద్యమకారుల విడుదలకు హైకోర్టు ఆదేశాలు..

ABN, First Publish Date - 2021-06-18T02:26:40+05:30

ఢిల్లీ అల్లర్ల కేసులో బెయిల్ మంజూరైన ముగ్గురు ఉద్యమకారులను విడుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కేసులో బెయిల్ మంజూరైన ముగ్గురు ఉద్యమకారులను విడుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశించింది. ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన దేవాంగన కలిత, నటాషా నర్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా సహా ముగ్గురు ఉద్యమకారులకు ఈ నెల 15న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ముగ్గుర్నీ విడుదల చేయాలంటూ ఇప్పటికే తాము ఆదేశాలు జారీ చేశామనీ.. ఇదే విషయమై తీహార్ జైలు అధికారులకు కూడా సమాచారం పంపామని కార్కార్‌ధూమా కోర్టుల అదనపు సెషన్స్ జడ్జి రవీందర్ బేడీ పేర్కొన్నారు. కాగా వీరికి సంబంధించిన పత్రాలను పరిశీలించేందుకు మరింత సమయం కావాలంటూ ఢిల్లీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. బుధవారమే బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. నిందితుల చిరునామా పరిశీలించేందుకు మరింత సమయం కావాలని పోలీసులు కోరడంతో విడుదల వాయిదా పడింది. గతేడాది 53 మంది ప్రాణాలను బలిగొన్న ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించి కుట్రపన్నారన్న కేసులో ఈ ముగ్గురు విద్యార్ధి నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-06-18T02:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising