ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్టెక్సీల్లో ఇకపై నా ఫోటో వద్దు: అస్సాం సీఎం షాకింగ్ ఆర్డర్స్

ABN, First Publish Date - 2021-08-06T10:48:30+05:30

ఓ రాష్ట్రానికి సీఎం అంటే అనేక చోట్ల ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, ఇక మరి కొన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిస్‌పుర్: ఓ రాష్ట్రానికి సీఎం అంటే అనేక చోట్ల ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, ఇక మరి కొన్ని చోట్లయితే ఏకంగా విగ్రహాలు సైతం వెలుస్తాయి. అయితే తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఫోటో ఉన్న ఓ ఫ్లెక్సీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యక్షమైంది. ఇక ఈ ఫ్లెక్సీలపై సీఎం స్పందించడంతో విషయం వార్తల్లోకెక్కింది. తన అనుమతి లేకుండా తన ఫోటో వాడి తయారు చేసిన ఫ్లెక్సీలపై అస్సాం సీఎం గురువారం స్సందించారు. ఇలా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేసుకోవడం తనకు నచ్చదని తేల్చి చెప్పారు. 


రాష్ట్ర తొలి సీఎం గోపీనాథ్ బోర్డోలోయ్‌కు నివాళి అర్పించే విధంగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే అందులో మాజీ సీఎం బోర్డోలోయ్ ఫోటో చిన్నదిగా వేసి.. ప్రస్తుతం సీఎం హేంమంత బిశ్వ శర్మది మాత్రం భారీ సైజులో వేశారు. దీంతో ఇకపై ఫ్లెక్సీల్లో తన ఫోటో వాడవద్దని, ఒకవేళ వాడాలనుకుంటే తన అధికారిక కార్యాలయం నుంచి అనుమతి పొందిన తరువాతనే వినియోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీటర్ వేదికగా వెల్లడించారు. కాగా.. అంతకుముందు బోర్డోలోయ్‌కు ఆయన స్వయంగా ఘన నివాళి అలర్పించారు.



Updated Date - 2021-08-06T10:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising