ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాహీఈద్గా మసీదులో కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని రైట్ వింగ్ గ్రూపుల హెచ్చరిక

ABN, First Publish Date - 2021-12-06T16:14:25+05:30

డిసెంబర్ 6వతేదీ అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా మధుర నగరంలోని శ్రీ కృష్ణ జన్మస్థాన్ దేవాలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధురలో సాయుధ పోలీసుల పహరా 

మధుర : డిసెంబర్ 6వతేదీ అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా మధుర నగరంలోని శ్రీ కృష్ణ జన్మస్థాన్ దేవాలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని రైట్ వింగ్ గ్రూపులు బెదిరించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం వెలుపల పోలీసు సిబ్బంది ని మోహరించారు. షాహీ ఈద్గా మసీదు ఉన్న కత్రా కేశవ్ దేవ్ ప్రాంతం చుట్టూ పోలీసులు మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. మధుర-బృందావన్ జంట నగరాల మధ్య నడిచే రెండు తీర్థయాత్ర రైళ్లను నిలిపివేశారు ప్రజలు గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. 


సాయుధ పోలీసుల భారీ భద్రతతో కాంప్లెక్స్ మొత్తం సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.అఖిల భారత హిందూ మహాసభ, శ్రీకృష్ణ జన్మభూమి నిర్మాణ న్యాస్, నారాయణి సేన, శ్రీకృష్ణ ముక్తి దళ్ అనే నాలుగు సంస్థలు డిసెంబరులో మసీదులో కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని హెచ్చరిక జారీ చేశాయి.  మసీదు ఉన్న స్థలం అసలు కృష్ణుని జన్మస్థలంగా ఆ సంస్థలు పేర్కొన్నాయి.మధురలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు పోలీసులు, పారామిలటరీ దళాలు సిద్ధంగా ఉన్నాయని మధుర ఎస్పీ గౌరవ్ గ్రోవర్ చెప్పారు.ఉత్తరప్రదేశ్ పోలీసులు డిసెంబర్ 4న హిందూ మహాసభ మధుర జిల్లా అధ్యక్షుడు ఛాయా గౌతమ్, సమూహం యొక్క మధుర నాయకుడు రిషి భరద్వాజ్‌లను అరెస్టు చేశారు. 


తమ కార్యకర్తలను నిర్బంధించారని, వారిని వెంటనే విడుదల చేయకుంటే లక్నోలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని నారాయణిసేన  హెచ్చరించింది.కృష్ణ జన్మభూమి ముక్తి దళ్ జాతీయ అధ్యక్షుడు రాజేష్ మణి త్రిపాఠి కూడా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కంటెంట్‌ను పోస్ట్ చేసినందున ప్రివెంటివ్ కస్టడీలో ఉంచారు.కృష్ణ జన్మభూమి నిర్మాణ న్యాస్‌కు చెందిన దేవ్ మురారిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి.


Updated Date - 2021-12-06T16:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising