ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..

ABN, First Publish Date - 2021-10-17T00:35:32+05:30

కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ముంచెత్తిన వరదలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొచ్చి: కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ముంచెత్తిన వరదలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇడుక్కి జిల్లాలోని తోడుపుళలో వరదల కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. రూరల్ కొట్టాయంలో కొండ చరియలు విరిగిపడి 12 మంది గల్లంతయ్యారు.


భారీ వర్షాల కారణంగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకోలేకపోవడంతో గాలింపు చర్యలు ముందుకు సాగడం లేదు. దీంతో సహాయక చర్యల కోసం వాయసేన సాయాన్ని కేరళ ప్రభుత్వం అర్థించింది. కొండచరియలు కారణంగా ఎక్కువగా ప్రమాదాలు సంభివిస్తున్న కొట్టాయం జిల్లాలోని కూటికల్‌లో సహాయ చర్యల కోసం వైమానిక సాయాన్ని కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.


 కొట్టాయంలో జిల్లాలో కొండ చరియలు విరిగిపడడంతో మూడు ఇళ్లు ధ్వంసం కాగా, పదిమంది గల్లంతయ్యారు. జిల్లాలో నాలుగు చోట్ల కూడా కొండచరియలు విరిగిపడినట్టు అధికారులు చెబుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో 60 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.


వరదల కారణంగా కొట్టాయం, పతనమ్‌థిట్ట జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. పతనమ్‌థిట్టలోని కక్కి డ్యామ్, త్రిసూర్‌లోని షోలాయర్, ఇడుక్కిలోని కుందాల, కల్లర‌కుట్టి డ్యామ్‌ల వద్ద రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అలాగే, రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.


Updated Date - 2021-10-17T00:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising