ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో రాత్రి పోలీసు పెట్రోలింగ్..firecrackers స్వాధీనం

ABN, First Publish Date - 2021-11-04T12:59:48+05:30

న్యూఢిల్లీ: దీపావళి పండుగ నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

55 మంది అరెస్ట్ 

న్యూఢిల్లీ :  దీపావళి పండుగ నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాత్రిపూట పెట్రోలింగ్‌ను కట్టుదిట్టం చేశారు. పహర్‌గంజ్, శంకర్ రోడ్, కన్నాట్ ప్లేస్‌లో భారీగా పోలీసులను మోహరించారు. బాణసంచాపై నిషేధం విధించినప్పటికి అక్రమంగా ఉంచిన 6,050 కిలోగ్రాముల బాణసంచానో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాణసంచా ఉన్న 55 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.ప్రజలు మాస్క్ ధరించాలని, పటాకులు పేల్చవద్దని సెంట్రల్ ఢిల్లీ డీసీపీ శ్వేతా చౌహాన్ కోరారు. పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులు నిఘాను పెంచారు.


మహిళా పోలీసులతో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో అక్రమ బాణాసంచా విక్రయాలపై మొత్తం 56 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ ఢిల్లీ జిల్లాలో అత్యధిక అరెస్టులు జరిగాయి. ఉత్తర ఢిల్లీ జిల్లాలో అత్యధిక మొత్తంలో పటాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.పశ్చిమ జిల్లాలో బాణాసంచా విక్రయిస్తున్న 11 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లా నుంచి 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పటాకుల పట్టివేత విషయానికి వస్తే ఒక్క ఉత్తర జిల్లాలోనే 2400 కిలోలకు పైగా పటాకులను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-11-04T12:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising