ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

dengue జ్వరాలు ప్రబలిన 9 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ బృందాలు

ABN, First Publish Date - 2021-11-03T17:30:41+05:30

దేశంలో డెంగీ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్వర నివారణకు చర్యలు

న్యూఢిల్లీ : దేశంలో డెంగీ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది. హర్యానా, పంజాబ్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్మూ అండ్ కశ్మీరు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలను అరికట్టేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల బృందాలను పంపనున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రాల నిపుణులను ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు.డెంగీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కేంద్ర నిపుణుల బృందం సాంకేతిక సూచనలు ఇవ్వనుంది. 


9 రాష్ట్రాల్లో డెంగీ నివారణపై సమీక్షించి దీని నివారణకు సత్వరం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ అన్ని రాష్ట్రాల వైద్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులను ఆదేశించారు. ఢిల్లీలో 1530 డెంగీ కేసులు వెలుగుచూశాయి. అక్టోబరు నెలలోనే అత్యధికంగా 1200 డెంగీ కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2021-11-03T17:30:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising