ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా టీకా వేసుకొని మద్యం సేవించొద్దు’

ABN, First Publish Date - 2021-01-14T17:07:31+05:30

‘కరోనా టీకా వేసుకొని మద్యం సేవించొద్దు’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు
  • ఆరోగ్యశాఖ మంత్రి  డాక్టర్‌ విజయభాస్కర్‌ 

చెన్నై : కరోనా టీకా వేసుకొని మద్యం సేవించరాదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ సూచించారు. చెన్నైకు చేరుకున్న కరోనా టీకాను రాష్ట్రవ్యాప్తంగా 10 మండలాలకు మంగళవారం తరలించారు. తిరుచ్చికి చేరుకున్న టీకాను ఖాజామలై ప్రాంతంలో ఉన్న ఆరోగ్యశాఖ సహాయ డైరెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో భద్రపరిచారు. ఈ కేంద్రాన్ని బుధవారం ఉదయం ఆరోగ్యశాఖ మంత్రి డా.సి.విజయభాస్కర్‌ పరిశీలించారు. ఆయనతో పాటు పర్యాటక శాఖ మంత్రి వెల్లమండి ఎన్‌.నటరాజన్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.వలర్మతి, కలెక్టర్‌ శివరాజు తదితరులున్నారు. 


తిరుచ్చి నుంచి ఇతర జిల్లాలకు టీకాలను తరలిస్తున్న ప్రత్యేక వాహనాలను మంత్రి విజయభాస్కర్‌ జెండా పూపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 16వ తేదీ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభించనున్నామని, కరోనా టీకా రాష్ట్రంలోని పది మండలాలకు తరలించి, అక్కడి నుంచి జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తున్నామన్నారు. టీకా వ్యవహారమై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు నమ్మరాదని, నిరాధారమైన వదంతులు సృష్టిస్తున్న వారిపై కఠినచర్యలు చేపడతామని మంత్రి హెచ్చరించారు.

Updated Date - 2021-01-14T17:07:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising