ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: స్వైన్‌ఫ్లూపై భయాందోళనలు వద్దు

ABN, First Publish Date - 2021-11-17T16:34:42+05:30

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ నిరోధానికి అన్ని చర్యలు చేపట్టినట్టు, ఈ విషయమై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. నగరంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ నిరోధానికి అన్ని చర్యలు చేపట్టినట్టు, ఈ విషయమై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. నగరంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, భారీవర్షంలో కూడా ఎగ్మూర్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఈనెల 11వ తేదీ 68 మంది జన్మించారని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 63 శాతం సిజేరియన్‌ ద్వారా ప్రసవాలు చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నామన్నారు. అదే సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో 65 శాతం సుఖప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. నీట్‌ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్‌కు పంపామన్నారు. కానీ, రాజ్‌భవన్‌ నుంచి ఆ తీర్మానం ఇంకా రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లలేదని, ఇందుకు గవర్నర్‌ న్యాయనిపుణులను సంప్రదిస్తుండడంతో జాప్యం జరుగుతోందని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయని అన్నారు. కోవైలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు నిర్ధారణ అయ్యాయన్నారు. దీంతో, కేరళ-తమిళనాడు సరి హద్దుల్లో వాహనాలకు క్రిమినాశిని మందులు పిచికారీ తర్వాతే అనుమతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ నిరోధక చర్యలను ముమ్మరం చేసినట్లు మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

Updated Date - 2021-11-17T16:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising