ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నడిగులను అవమానించిన అమిత్‌షా: కుమారస్వామి

ABN, First Publish Date - 2021-01-17T23:03:50+05:30

కర్ణాటకలోని బీజేపీ సర్కార్‌ 'కన్నడ వ్యతిరేక వైఖరి'ని అనుసరిస్తోందంటూ మాజీ ముఖ్యమంత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటకలోని బీజేపీ సర్కార్‌ 'కన్నడ వ్యతిరేక వైఖరి'ని అనుసరిస్తోందంటూ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ నేత హెచ్‌డీ కుమారస్వామి తప్పుపట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో బీజేపీ నేతలు కన్నడ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారని అన్నారు.


'షిమోగా జిల్లా భద్రావతిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిట్‌కు కేంద్ర మంత్రి శనివారంనాడు శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన ఫలకంపై కేవలం హిందీ, ఆంగ్ల భాషను మాత్రమే వాడారు' అని వరుస ట్వీట్లలో కుమారస్వామి పేర్కొన్నారు. ఆంగ్ల, హిందీ భాషకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కన్నడ భాషను నిర్లక్ష్యం చేసే విధంగా అమిత్‌షా ప్రవర్తించారని, ఇది కన్నడిగుల ప్రతిష్టకు జరిగిన అవమానమని అన్నారు. కేంద్ర ఆర్ఏఎఫ్ యూనిట్‌కు భూమి కేటాయించినది కర్ణాటకాయేనని కుమారస్వామి గుర్తుచేశారు.

Updated Date - 2021-01-17T23:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising