ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలుపులు తెరుచుకున్న హాసనాంబ ఆలయం

ABN, First Publish Date - 2021-10-29T16:42:34+05:30

ఏడాది కోసారి మాత్రమే తెరుచుకునే హాసనాంబ దేవాలయం శాస్త్రోక్తంగా తలుపులు తెరుచుకుంది. జిల్లా కేంద్రమైన హాసన్‌లో వెలసి ఉండే హాసనాంబ ఆలయం ఏడాదికోసారి మాత్రమే తెరిచే సంప్రదాయం ఉంది. తొమ్మిదిరోజుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  రెండేళ్ల తర్వాత భక్తులకు అనుమతి 

- వ్యాక్సిన్‌ వేసుకుంటేనే అమ్మవారి దర్శనం


బెంగళూరు(Karnataka): ఏడాది కోసారి మాత్రమే తెరుచుకునే హాసనాంబ దేవాలయం శాస్త్రోక్తంగా తలుపులు తెరుచుకుంది. జిల్లా కేంద్రమైన హాసన్‌లో వెలసి ఉండే హాసనాంబ ఆలయం ఏడాదికోసారి మాత్రమే తెరిచే సంప్రదాయం ఉంది. తొమ్మిదిరోజుల పాటు హాసనాంబ దేవీ దర్శనంతో పాటు ఘనంగా జాతర కొనసాగుతుంది. గత ఏడాది కొవిడ్‌ కారణంగా భక్తులకు దర్శనం లేకుండానే సంప్రదాయంగా పూజలు జరిపారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా కొవిడ్‌ ప్రభావం తగ్గినమేరకు భక్తులు దర్శించుకునేలా అధికారులు తీర్మానించారు. హాసనాంబ ఆలయం గురువారం మధ్యాహ్నం తెరుచుకోగా సాయంత్రం దాకా పూజలు కొనసాగాయి. శు క్రవారం నుంచి భక్తులకు దర్శనం చేసుకునే వెసలుబాటు ఉంది. ఉత్సవాలు నవంబరు 6వరకూ కొనసాగనుండగా భక్తులు 5వ తేదీ దాకా దర్శించుకోవచ్చునని జిల్లాధికారి గిరీష్‌ ప్రకటించారు. రోజూ ఉదయం 6గంటల నుంచి రాత్రి 8వరకూ దర్శనం చేసుకోవచ్చును. మధ్యాహ్నం 1- 3గంటల దాకా నైవేద్యం సమర్పించే వేళలో భక్తులు గుడిలోకి వెళ్లేందుకు వీలుండదు. దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్‌ ఒక వ్యాక్సిన్‌ అయినా తప్పనిసరిగ వేసుకోవాల్సి ఉంది. అందుకు సంబంధించి డిజిటల్‌ లేదా నకలు కాపీలు అందజేయాల్సి ఉంటుంది. సాధారణ దర్శనంతో పాటు రూ.300, రూ.1000తో ప్రత్యేక దర్శన టికెట్లు సిద్దం చేశారు. ఆలయంతో పాటు హాసన్‌ వీధులు శుభ్రంగా తీర్చారు. పూలు, విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాం తాల నుంచి భక్తులు వస్తున్నందున పలు చోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-10-29T16:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising