ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరజ్ ‘బంగారు’ వార్త విన్న వెంటనే హర్యానా మంత్రి డ్యాన్స్

ABN, First Publish Date - 2021-08-08T00:50:22+05:30

టోక్యో ఒలింపిక్స్‌, 2020లో భారత దేశానికి తొలి బంగారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌, 2020లో భారత దేశానికి తొలి బంగారు పతకం సాధించిన జావెలిన్ త్రోయర్‌ నీరజ్ చోప్రాను హర్యానా మంత్రి అనిల్ విజ్ తనదైన శైలిలో అభినందించారు. టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న ఆయన నీరజ్ బంగారు పతకాన్ని సాధించినట్లు తెలుసుకున్న వెంటనే ‘భారత్ మాతా కీ జై’, ‘నీరజ్ చోప్రా జై’ అంటూ తన సహచరులతో కలిసి నాట్యం చేశారు. 


నీరజ్ చోప్రా స్వస్థలం హర్యానాలోని పానిపట్‌. ఆయనకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లు బహుమతిని ప్రకటించింది. గ్రూప్-1 ఉద్యోగంతోపాటు మరికొన్ని రాయితీలను  ఇస్తామని తెలిపింది. 


నీరజ్ చోప్రా ఘన విజయం సాధించడంతో అనిల్ విజ్, ఆయన సహచరులు, భద్రతా సిబ్బంది సంతోషంతో చిందులు వేశారు. ఈ అద్భుత క్షణాలను హర్షాతిరేకాలతో ఆస్వాదించారు. 


హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖత్తార్ కూడా ఈ ఫైనల్స్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో వీక్షించారు. 


Updated Date - 2021-08-08T00:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising