ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం దొంగిలించింది : హర్యానా మంత్రి

ABN, First Publish Date - 2021-04-21T21:16:20+05:30

హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ బుధవారం ఢిల్లీ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ బుధవారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణ చేశారు. ఢిల్లీ గుండా ఫరీదాబాద్ వస్తున్న ఓ ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దొంగతనంగా తీసుకెళ్ళిందని ఆరోపించారు. అప్పటి నుంచి హర్యానా రాష్ట్రానికి వస్తున్న అన్ని ఆక్సిజన్ సిలిండర్ల వాహనాలకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించామన్నారు. 


అనిల్ విజ్ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, హర్యానాలోని ఫరీదాబాద్‌కు వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒకదానిని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం దొంగతనం చేసిందన్నారు. ఇకపై అన్ని ట్యాంకర్లకు పోలీసు రక్షణ ఉండాలని ఆదేశించానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే, ఇక ఆరోగ్య సంరక్షణ రంగంలోని మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయని చెప్పారు. 


అనిల్ విజ్ హర్యానా హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విషయం గమనార్హం. హర్యానాకు ఆక్సిజన్ తగిన స్థాయిలో ఉందని, ఢిల్లీకి ఆక్సిజన్‌ను పంపించడానికి సుముఖంగా ఉన్నామని, అయితే రాష్ట్ర అవసరాలను తీర్చుకున్న తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ‘‘మా ఆక్సిజన్‌ను ఢిల్లీకి ఇవ్వాలని మాపై ఒత్తిడి వస్తోంది’’ అని చెప్పారు. 


హర్యానా మంత్రి ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వ స్పందన తెలియవలసి ఉంది.


Updated Date - 2021-04-21T21:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising