ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab : Cm అమరీందర్‌ను బుజ్జగిస్తున్న highcommand

ABN, First Publish Date - 2021-07-17T20:13:29+05:30

సిద్దూకు పీసీసీ పదవిని కట్టబెట్టనున్న నేపథ్యంలో పంజాబ్ సీెం అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సిద్దూకు పీసీసీ పదవిని కట్టబెట్టనున్న నేపథ్యంలో పంజాబ్ సీెం అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రికి ఓ లేఖ కూడా రాశారు. పంజాబ్ విషయంలో అధిష్ఠానం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని, సీనియర్లను విస్మరిస్తున్నారని లేఖలో దుయ్యబట్టారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి కష్టమేనని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను బుజ్జగించే పనిలో నిమగ్నమైంది అధిష్ఠానం. పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ హరీశ్ రావత్ శనివారం సీఎం అమరీందర్‌తో భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ భేటీ సాగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హరీశ్ రావత్ మాట్లాడుతూ, పంజాబ్ విషయంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి సీఎం అమరీందర్ కట్టుబడే ఉంటారని పేర్కొన్నారు. సోనియా నిర్ణయానికి తాను కట్టుబడే ఉంటానని తనతో అన్నారని హరీశ్ రావత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అమరీందర్ మాట్లాడుతూ... ‘‘హరీశ్ రావత్‌తో భేటీ ఫలప్రదమైంది. సోనియా ఏ నిర్ణయం తీసుకున్నా... కట్టుబడే ఉంటాం. కొన్ని సమస్యలున్నాయి. వాటిని అధ్యక్షురాలు సోనియాతో చర్చించుకుంటాం’’ అని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఫైర్‌బ్రాండ్ సిద్దూ కూడా ఇతర నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సునీల్ జాఖడ్‌తో భేటీ అయ్యారు. 

Updated Date - 2021-07-17T20:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising