ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ కాంగ్రెస్‌లో మరో కీలక మార్పు

ABN, First Publish Date - 2021-10-22T22:39:39+05:30

అయితే పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జీగా నూతనంగా నియామకమైన హరీష్ చౌదరికి కూడా ఇందులో పాత్ర ఉందని అంటున్నారు. ముఖ్యంగా కెప్టెన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంలో హరీష్ చౌదరి కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్‌లో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా హరీష్ రావత్‌ను తప్పించి హరీష్ చౌదరిని నియమించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. హరీష్ రావత్ సమక్షంలోనే పంజాబ్ కాంగ్రెస్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం నుంచి అమరీందర్ కేబినెట్ నుంచి తప్పుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూని పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా చేయడం వరకు హరీష్ రావత్ సమక్షంలో జరిగాయి. ఈ సెగ ఇంకా పంజాబ్ కాంగ్రెస్‌ను వీడలేదు. అటు అమరీందర్ ఇటు సిద్ధూ నిత్యం ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూనే ఉన్నారు.


అయితే పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జీగా నూతనంగా నియామకమైన హరీష్ చౌదరికి కూడా ఇందులో పాత్ర ఉందని అంటున్నారు. ముఖ్యంగా కెప్టెన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంలో హరీష్ చౌదరి కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. హరీష్ చౌదరికి పంజాబ్ కాంగ్రెస్ కొత్తేమీ కాదు. గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ పంజాబ్ ఇంచార్జీగా వ్యవహరించారు. పంజాబ్‌పై మంచి పట్టు ఉన్న వ్యక్తి. అందుకే అతడిని పంజాబ్ ఇంచార్జీగా నియమించినట్లు చెబుతున్నారు. రాజస్తాన్‌కు చెందిన హరీష్ చౌదరి, గెహ్లాత్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే కాంగ్రెస్‌లో పార్టీలో ఏఐసీసీ సెక్రెటరీగా ఉన్నారు.

Updated Date - 2021-10-22T22:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising