ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకా రెండో డోసు తీసుకున్నాక వైద్యుడికి కరోనా..!

ABN, First Publish Date - 2021-03-07T02:56:41+05:30

రెండో కరోనా టీకా డోసు తీసుకున్న కొద్ది రోజులకు గుజరాత్‌ వైద్యాధికారి ఒకరు కరోనా బారినపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: రెండో కరోనా టీకా డోసు తీసుకున్న కొద్ది రోజులకు గుజరాత్‌ వైద్యాధికారి ఒకరు కరోనా బారినపడ్డారు. దెహ్గామ్ తాలూకాలో ఆయన పనిచేస్తున్నారు. జనవరి 16న ఆయన తొలి డోసు తీసుకున్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 15న రెండో డోసు పొందారు. ఆ తరువాత ఆయనకు జ్వరం రావడంతో వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకినట్టు తేలింది. గాంధీనగర్ ప్రధాన వైద్యాధికారి శనివారం నాడు ఈ విషయాలను వెల్లడించారు. ఆయనకు రోగ లక్షణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నాయి. సోమవారం నుంచి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని తనతో చెప్పినట్టు తెలిపారు. రెండో కరోనా డోసు తరువాత 45 రోజుల తరువాతే శరీరంలో పూర్తిస్థాయిలో కరోనా యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయని ప్రధాన వైద్యాధికారి తెలిపారు. కాబట్టి.. రెండో డోసు తీసుకున్నాక కూడా ప్రజలు కొంతకాలం పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక తాజా లెక్కల ప్రకారం.. గుజరాత్‌లో ఇప్పటివరకూ 272240 కేసులు వెలుగు చూశాయి. 4413 కరోనా మరణాలు సంభవించాయి. 

Updated Date - 2021-03-07T02:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising