ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యపై భర్త అత్యాచారానికి మినహాయింపు సమంజసమేనా? : గుజరాత్ హైకోర్టు

ABN, First Publish Date - 2021-12-16T20:08:43+05:30

భార్యపై భర్త అత్యాచారం చేసినపుడు నేరంగా పరిగణించకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ : భార్యపై భర్త అత్యాచారం చేసినపుడు నేరంగా పరిగణించకుండా మినహాయింపు ఇవ్వడం స్పష్టమైన నిరంకుశత్వమా? అనే అంశాన్ని పరిశీలించవలసిన సమయం ఆసన్నమైందని గుజరాత్ హైకోర్టు గురువారం తెలిపింది. ఇటువంటి మినహాయింపు రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందా? అంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరుపుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 


‘‘భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 375కు రెండో మినహాయింపును స్పష్టమైన నిరంకుశత్వమని అభివర్ణించవచ్చునా? మహిళకుగల లైంగిక స్వయంప్రతిపత్తి ప్రాథమిక హక్కు ఆమె భర్తకు కలిగే అకస్మాత్తు కోరికలకు లోబడి ఉండేలా ఈ మినహాయింపు చేస్తోందా? అనే అంశాలను పరిశీలించే కసరత్తును రిట్ కోర్టు చేపడుతోంది’’ అని హైకోర్టు పేర్కొంది. 


ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం అత్యాచారం (రేప్) చేయడం నేరం. అయితే ఈ సెక్షన్‌కు మినహాయింపు-2 ఏం చెప్తోందంటే, ఓ పురుషుడు తన భార్యతో, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగాకానీ, ఆమె సమ్మతి లేకుండా కానీ, ఆమెను బలవంతం చేసి లైంగిక సంభోగం జరిపినప్పటికీ నేరం కాదు. ఫలితంగా భర్త అత్యాచారం నేరం క్రింద శిక్షార్హుడు కాదు. 


ఈ మినహాయింపు నిరంకుశత్వంగా, అసమంజసంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, భారత రాజ్యాంగంలోని అధికరణలు 14, 15, 19, 21లను ఉల్లంఘిస్తోందని రాజ్యాంగం గుర్తించిన మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, రాజ్యాంగ నైతికతను, సూత్రాలను ఉల్లంఘిస్తోందని పిటిషనర్ జైదీప్ వర్మ తన పిటిషన్‌లో ఆరోపించారు. బలవంతపు లైంగిక సంభోగం నుంచి మహిళకు చట్టం కల్పించిన రక్షణను ఈ మినహాయింపు ఉపసంహరిస్తోందని ఆరోపించారు. శారీరక సమగ్రత, లైంగిక స్వయంప్రతిపత్తి, శారీరక గోప్యతలను భార్య తన భర్తకు బలవంతంగా అప్పగించవలసిన నిర్బంధ పరిస్థితిని కల్పిస్తోందని ఆరోపించారు. మహిళకుగల లైంగిక స్వయం ప్రతిపత్తి ప్రాథమిక హక్కు ఆమె భర్త అకస్మాత్తు కోరికలకు లోబడి ఉండేలా ఈ మినహాయింపు-2 చేస్తోందన్నారు. గర్భవతి అయిన భార్యపై భర్త అత్యాచారం చేయడాన్ని, సమ్మతి తెలియజేసే పరిస్థితిలో లేనటువంటి భార్యపై భర్త చేసే అత్యాచారాన్ని, శారీరక లేదా మానసిక అస్వస్థత కారణంగా సమ్మతి తెలియజేయలేని స్థితిలో ఉన్న భార్యపై భర్త చేసే అత్యాచారాన్ని, తీవ్రమైన శారీరక హాని కలిగించేవిధంగా భర్త చేసే అత్యాచారాన్ని, భార్యపై పదే పదే భర్త అత్యాచారాలకు పాల్పడటాన్ని అత్యాచార నేరం నుంచి ఈ మినహాయింపు పూర్తిగా బయటపడేసిందని పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-16T20:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising