యూత్‌కు సవాల్ విసిరిన బామ్మ
ABN, First Publish Date - 2021-06-07T17:18:31+05:30
భయపడితే భయపెడుతుంది.. ధైర్యంగా ఎదుర్కొంటే తోకముడుస్తుంది.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు..
భయపడితే భయపెడుతుంది.. ధైర్యంగా ఎదుర్కొంటే తోకముడుస్తుంది.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటికే చాలా మంది బామ్మలు ఇదే మాట చెప్పారు. చెప్పడమే కాదు.. కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉండి.. కోలుకుని యూత్‌కు సవాల్ విసిరారు.. గురుగ్రామ్‌కు చెందిన 99 ఏళ్ల బామ్మ లాడో దేవి ఈ లిస్టులో చేరింది. కరోనా మహమ్మారి సోకిందని తెలియగానే ఆస్పత్రికి తరలించలేదు. హడావుడి పడలేదు. ప్రాణం పోతుందేమోనని భయపడలేదు. ఇంట్లోవారంతా ధైర్యంగా ఉన్నారు. అందరికన్నా మరింత ధైర్యంగా లాడో దేవి ఉంది. హోం ఐసోలేషన్‌లో ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనాను జయించింది. ఆమె దగ్గరున్న పేపర్లు పరిశీలిస్తే 99 ఏళ్లు అని చెబుతోంది. కానీ 1918లో స్పానిష్ ఫ్లూని చూశానని చెప్పిందని ఈ లెక్కన ఆమె సెంచరీ దాటిందని ఆమె మనవడు చెబుతున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో పరిస్థితులు చూసి అక్కడవరకు తీసుకువెళ్లాలనుకోలేదని అన్నాడు. ఇంట్లోనే మొక్కల మధ్య ఉంచి జాగ్రత్తగా చూసుకున్నామని, ఆయుష్మాన్ భారత్ అధికారుల సాయంతో ఆమెను కాపాడుకోగలిగామని లాడోదేవి మనవడు అన్నాడు.
Updated Date - 2021-06-07T17:18:31+05:30 IST