ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kabul: తాలిబన్ల చేతుల్లో సంగీత పరికరాలు ధ్వంసం

ABN, First Publish Date - 2021-09-06T17:44:28+05:30

అఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక పలు రికార్డింగ్ స్టూడియోల్లోని సంగీత వాయిద్య పరికరాలను ధ్వంసం చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ (అఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక పలు రికార్డింగ్ స్టూడియోల్లోని సంగీత వాయిద్య పరికరాలను ధ్వంసం చేశారు.కాబూల్ నగరంలోని స్టేట్ రికార్డింగ్ స్టూడియోల్లో తాలిబన్ గార్డులు రెండు గ్రాండ్ పియానోలు, ఇతర సంగీత వాయిద్యాలను ధ్వంసం చేశారు. ఆగస్టు 15వతేదీన అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చాక సంగీతానికి గడ్డు రోజులు వచ్చాయి.అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాందహార్ నగరంలోని టెలివిజన్, రేడియో ఛానెళ్లలో సంగీతం, స్త్రీ గాత్రాలను తాలిబన్లు నిషేధించారు.సెప్టెంబరు 4వతేదీన సాయుధ తాలిబన్ గార్డు అఫ్ఘానిస్థాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్‌ను మూసివేశారు.


తాలిబన్ ఫైటర్ లోయలో ఉన్న అఫ్ఘాన్ జానపద గాయకుడు ఫవాద్ అండరాబిని ఆగస్టు చివరి వారంలో కాల్చి చంపాడు. ఇస్లాంలో సంగీతం నిషేధించారని, ప్రజలు సంగీత కార్యక్రమాల్లో పాలుపంచుకోవద్దని తాము కోరతామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు. కాబూల్ నగరంలోని రికార్డింగ్ స్టూడియోలలోని సంగీత వాయిద్యాలకు జరిగిన నష్టంతో సంగీతంపై తాలిబన్ల వైఖరి స్పష్టమవుతోంది.




Updated Date - 2021-09-06T17:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising