ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పరిశీలనలో వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానం!

ABN, First Publish Date - 2021-01-15T00:42:30+05:30

వినియోగదారుల ఆగ్రహానికి కారణమవుతున్న వాట్సాప్ ప్రైవసీ నిబంధనల మార్పుపై కేంద్రం తాజాగా దృష్టి సారించినట్టు తెలుస్తొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వినియోగదారుల ఆగ్రహానికి కారణమవుతున్న వాట్సాప్ ప్రైవసీ నిబంధనల మార్పుపై కేంద్రం తాజాగా దృష్టి సారించినట్టు తెలుస్తొంది. ఈ విషయమై అన్ని వివరాలను సేకరిస్తున్నాం. అని ప్రభుత్వాధికారు ఒకరు వ్యాఖ్యానించారు. సమాచార భద్రతకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి చట్టమూ లేని కారణంగానే ప్రభుత్వ వాట్సాప్ ప్రవైసీ నిబంధనల మార్పుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 


వాట్సాప్ వినియోగదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో కూడా పంచుకునేందుకు వీలుగా రూపొందించిన ఈ కొత్తీ విధానంపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమాచార మార్పిడికి ఫిబ్రవరి 8లోగా వాట్సాప్ వినియోగదారులు అంగీకారం తెలపాలని ఈ యాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. దీనికి అంగీకరించని పక్షంలో వాట్సాప్ సేవలు వినియోగించుకోలేరని తేల్చి చెప్పింది. ఈ మార్పుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారత వినియోగదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్, టెలిగ్రామం వంటి ప్రత్యామ్నాయ యాప్‌లను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా ఈ  పాలసీ మార్పుపై దృష్టి పెట్టింది. 

Updated Date - 2021-01-15T00:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising