ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మోదీ పుట్టిన రోజున రికార్టు స్థాయిలో వ్యాక్సినేషన్‌’

ABN, First Publish Date - 2021-09-16T00:09:55+05:30

ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ను రెట్టింపు చేసి రోజు వారి రికార్డుల్లో ఎక్కువ టీకాలు వేసిన రోజుగా సెప్టెంబర్‌ను రికార్డుల్లో నమోదు చేయాలని అనుకుంటున్నాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం రోజున దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అత్యధికంగా జూన్ 21న 88.09 లక్షల టీకాలు వేశారు. అనంతరం ఆగస్టు 27న రికార్డ్ స్థాయిలో 1.03 కోట్ల టీకాలు వేశారు. కాగా, సెప్టెంబర్ 17న మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ అత్యధికం సంఖ్యలో టీకాలు వేయాలని నిశ్చయించినట్లు కేంద్రంలోని ఉన్నతాధికారులు తెలిపారు.


‘‘ఆయన మన ప్రధానమంత్రి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ను రెట్టింపు చేసి రోజు వారి రికార్డుల్లో ఎక్కువ టీకాలు వేసిన రోజుగా సెప్టెంబర్‌ను రికార్డుల్లో నమోదు చేయాలని అనుకుంటున్నాం’’ అని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం రోజు వారి వ్యాక్సినేషన్ 69 లక్షలుగా కొనసాగుతోంది. దీనిని మోదీ పుట్టినరోజున 1.2 కోట్లకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. దీని కోసం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను ప్రధానంగా ఎంచుకున్నట్లు సమాచారం.

Updated Date - 2021-09-16T00:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising