ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర సర్కారు 3 బిల్లులు

ABN, First Publish Date - 2021-07-07T08:16:21+05:30

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారు మంగళవారం అసెంబ్లీలో మూడు సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, జూలై 6: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారు మంగళవారం అసెంబ్లీలో మూడు సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. వ్యవసాయం, సహకారం, ఆహారం-పౌర సరఫరాలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లుల్లో పేర్కొన్న షరతుల ప్రకారం.. రైతుల నుంచి వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి నిర్దిష్ట గడువులోపు వారికి నగదు చెల్లించకుంటే మూడేళ్ల జైలుశిక్ష లేదా రూ.5 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.  రైతులను వేధించినా ఈ శిక్షలు విధించవచ్చు. ఉత్పత్తి, సప్లై, పంపిణీ, నితావ్యసరాల సరుకులపై నియంత్రణ విధించడం వంటి షరతులను కూడా ఈ బిల్లుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి బాలాసాహెచ్‌ థోరట్‌ మాట్లాడుతూ  కేంద్రం తెచ్చిన చట్టాల్లో కొన్ని నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాసేలా ఉన్నాయన్నారు.  కేంద్ర చట్టాలకు సవరణలను సూచించాలని అనుకుంటున్నామని  చెప్పారు. నిత్యావసర వస్తువుల సవరణ, రైతుల సాధికార, రక్షణ, గ్యారంటీ ధర, మహారాష్ట్రకు సంబంధించి వ్యవసాయ సంబంధిత ఒప్పందాలపై కీలక వ్యక్తుల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని వెల్లడించారు. 

Updated Date - 2021-07-07T08:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising