ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పరాక్రమ దివస్’ గా నేతాజీ జయంతి.. అధికారిక ప్రకటన

ABN, First Publish Date - 2021-08-02T22:30:44+05:30

జనవరి 23 ను ‘పరాక్రమ దివస్’ గా కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జనవరి 23 ను ‘పరాక్రమ దివస్’ గా కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతిని పురస్కరించుకొని ఈ విషయాన్ని ప్రకటిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై లోక్‌సభలో కిషన్ రెడ్డి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామని, ప్రభుత్వం ఆమోదించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 


‘పరాక్రమ్ దివస్’ వర్సెస్ ‘దేశ్‌నాయక్ దివస్’

బెంగాల్ ఎన్నికల వేళ నేతాజీ జయంతి కీలకంగా మారిపోయింది. నేతాజీ పుట్టిన రోజు సందర్భంగా ఇకపై జనవరి 23న ప్రతి సంవత్సరం ‘పరాక్రమ దివస్’ గా జరపాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేతాజీని దేశ్‌నాయక్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ పిలిచేవారని, పరాక్రమ దివస్ ఏంటని మమతా ఎద్దేవా చేశారు. తాము మాత్రం ‘లోక్‌నాయక్ దివస్’ అన్న పేరిటే జయంతి ఉత్సవాలు జరుపుతామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఈ వ్యవహారం బెంగాల్‌ రాజకీయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.

Updated Date - 2021-08-02T22:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising