ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్ సెర్చ్ ఫలితంపై వివాదం.. అత్యంత ఛండాలమైన భాష ఏదంటే..?

ABN, First Publish Date - 2021-06-04T03:07:33+05:30

దేశంలో అత్యంత ఛండాలమైన భాష ఏదనే ప్రశ్నకు కన్నడ అని గూగుల్ సెర్చ్ ఫలితాల్లో రావడంతో ఇది కర్ణాటకలో కలకలానికి దారితీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దేశంలో అత్యంత ఛండాలమైన భాష ఏదనే ప్రశ్నకు కన్నడ అని గూగుల్ సెర్చ్ ఫలితాల్లో రావడంతో ఇది కర్ణాటకలో కలకలానికి దారితీసింది. గూగుల్‌పై అక్కడి ప్రజలు, రాజకీయ నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీనిపై కర్ణాటక డిప్యుటీ సీఎం ట్వీటర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘‘కన్నడ అంటే కేవలం ఒక భాష కాదు. అది కన్నడిగుల మనోభావాలకు ప్రతీక’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు గూగుల్‌పై మండిపడుతున్నారు. కన్నడ ప్రజలకు గూగుల్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి సెర్చ్ ఫలితాలను తొలగించాలని, ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు గూగుల్‌ను డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-06-04T03:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising