ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: బాణసంచా విక్రయం, కాల్చడంపై నిషేధాస్త్రం

ABN, First Publish Date - 2021-09-29T17:33:48+05:30

కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలుష్య నియంత్రణకు సర్కారు సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1వతేదీ వరకు ఢిల్లీలో బాణసంచా విక్రయం, కాల్చడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం ఢిల్లీలో వాయికాలుష్యాన్ని నివారించేందుకు బాణసంచాపై పూర్తి నిషేధం విధించినట్లు సర్కారు తెలిపింది. శీతాకాలంలో దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతుందని గుర్తించిన అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు. 




దీపావళి, నూతన సంవత్సర వేడుకల్లో పటాకులు కాల్చడం వల్ల ఢిల్లీలో గాలిలో నాణ్యత క్షీణిస్తోంది. వాయు కాలుష్యం బారినుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఢిల్లీలో పటాకులను నిషేధించామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. దేశ రాజధానిలో అన్ని రకాల పటాకుల నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.


Updated Date - 2021-09-29T17:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising