ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది నిజంగా శుభవార్తే.. కానీ జాగ్రత్త..: Adar poonawalla

ABN, First Publish Date - 2021-07-18T19:45:27+05:30

కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిని కూడా అనుమతిస్తామంటూ ఇప్పటివరకూ 16 ఐరోపా దేశాలు ప్రకటించడంపై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిని కూడా అనుమతిస్తామంటూ ఇప్పటివరకూ 16 ఐరోపా దేశాలు ప్రకటించడంపై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఈ నిబంధనల్లో దేశాల వారీగా మార్పులు ఉంటాయని, పర్యాటకులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ‘సీరం‌’ తయారు చేసిన కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారు స్వేచ్ఛగా తమ దేశంలోకి రావచ్చని శనివారం ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టీకా తీసుకున్న వారిపై తప్పనిసరి క్వారంటైన్ వంటి కరోనా ఆంక్షలేవీ విధించబోమని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 


అయితే.. ఆస్ట్రాజెనెకా స్వయంగా తయారు చేసిన కరోనా టీకాను గుర్తించిన ఐరోపా సమాఖ్య..ఆస్ట్రాజెనెకా అనుమతితో అదే ఫార్ములా ఆధారంగా ‘సీరం’ భారత్‌లో తయారు చేసిన కొవిషీల్డ్‌ టీకాను మాత్రం గుర్తించలేదు. దీంతో..ఈ టీకా తీసుకున్న వారికి ‘గ్రీన్ పాస్’ లభించక ఐరోపా ప్రయాణం దుర్లభమైపోయింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగడంతో పలు ఐరోపా దేశాలు ఈయూ నిర్ణయంతో సంబంధం లేకుండా కొవిషీల్డ్ తీసుకున్న వారిని అనుమతిస్తామని ప్రకటించాయి. ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, ఫిన్‌ల్యాండ్, జర్మనీ, హంగరీ, ఐస్‌ల్యాండ్, ఐర్లాండ్, లాట్వియా, నెదర్‌ల్యాండ్స్, స్లోవేనియా, స్పెయిన్, స్వీడెన్‌తో పాటూ స్విట్జర్లాండ్‌ కూడా కొవిషీల్డ్ తీసుకున్న వారిని దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది. ఈ జాబితాలోకి తాజాగా ఫ్రాన్స్ కూడా వచ్చి చేరింది. 



Updated Date - 2021-07-18T19:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising