ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగులకు శుభవార్త

ABN, First Publish Date - 2021-12-08T16:32:10+05:30

నిరుద్యోగులకు శుభవార్త! వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్‌-2, 2ఏ పరీక్షలు, మార్చిలో గ్రూప్‌-4 పరీక్షలకు సం బంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎన్‌పీఎస్‌సీ) ప్రకటించింది. నోటిఫికేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిబ్రవరిలో గ్రూప్‌-2, మార్చిలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌

టైం టేబుల్‌ విడుదల చేసిన టీఎన్‌పీఎస్సీ

చెన్నై/పెరంబూర్: నిరుద్యోగులకు శుభవార్త! వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్‌-2, 2ఏ పరీక్షలు, మార్చిలో గ్రూప్‌-4 పరీక్షలకు సం బంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎన్‌పీఎస్‌సీ) ప్రకటించింది. నోటిఫికేషన్‌ వెలువడిన 75 రోజు ల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి టీఎన్‌పీఎస్‌సీ రాతపరీక్ష నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనేది ముందుగానే ప్రకటించడం ఆన వాయితీ. ఆ ప్రకారం 2022లో పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల నిబంధనలను టీఎన్‌పీఎస్‌సీ చైర్మన్‌ బాలచంద్రన్‌ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2022వ సంవత్సరంలో 32 విభాగాలకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా 5,831 ఖాళీ పోస్టుల భర్తీకి గ్రూప్‌-2, గ్రూప్‌-2ఏ పరీక్షలకు సంబంధించి ఫిబ్రవరిలోను, 5,255 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సంబంధించి మార్చిలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపారు. నోటిఫికేషన్‌ విడుదలైన 75 రోజుల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు పరీక్షకు దరఖాస్తు చేసుకొనే వారికందరికీ ‘వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌’ విధానం నమోదు చేస్తామన్నారు. అలా నమోదుచేసుకున్న వారికి ఆధార్‌ నెంబరు తప్పనిసరి అన్నారు. పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలు తీసుకెళ్లే వాహనాలను జీపీఎస్‌ పరికరం ద్వారా పర్యవేక్షించనున్నట్లు బాలచంద్రన్‌ తెలిపారు.

Updated Date - 2021-12-08T16:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising