ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోల్డ్‌మేన్‌పై చీటింగ్‌ కేసు

ABN, First Publish Date - 2021-06-17T13:32:09+05:30

‘పనంగాట్టుపడై’ పార్టీ అధ్యక్షుడు, గోల్డ్‌మేన్‌గా పేరుపొందిన హరి నాడార్‌ రూ.1.50 కోట్లు మోసం చేశారని చెన్నై సెంట్రల్‌ క్రైంబ్రాంచ్‌ పోలీసులకు గుజరాత్‌కు చెందిన ఓ సంస్థ ఫిర్యాదు చేసింది. గు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ప్యారీస్‌(చెన్నై): ‘పనంగాట్టుపడై’ పార్టీ అధ్యక్షుడు, గోల్డ్‌మేన్‌గా పేరుపొందిన హరి నాడార్‌ రూ.1.50 కోట్లు మోసం చేశారని చెన్నై సెంట్రల్‌ క్రైంబ్రాంచ్‌ పోలీసులకు గుజరాత్‌కు చెందిన ఓ సంస్థ ఫిర్యాదు చేసింది. గుజరాత్‌లో పనిచేస్తున్న ఈడీఎస్‌ అనే సంస్థ యజమాని ఇస్మాయిల్‌, సంస్థ కార్యదర్శి అబ్దుల్‌ స్థానిక వేపేరిలో వున్న సెంట్రల్‌బ్రాంచ్‌ కార్యాలయానికి వెళ్లి హరినాడార్‌పై ఫిర్యాదు చేశారు. తమ సంస్థకు బ్యాంకు ద్వారా రూ.100 కోట్ల రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, రూ.1.50 కోట్లు తీసుకున్నాడని, తమ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రూ.1.25 కోట్లు బ్యాంకు ద్వారా, మిగిలిన రూ.25 లక్షలు నేరుగా హరినాడార్‌కు ఇచ్చామని వివరించారు. ఈ మొత్తాన్ని గత మార్చి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అతను తమ వద్ద తీసుకున్నట్టు ఆధారాలు కూడా వున్నాయన్నారు. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా హరినాడార్‌ తమను మోసగించారని తెలిపారు. తమకు డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా, తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఆలంగుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని, ఎన్నికల అనంతరం ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తానని చెప్పాడన్నారు. అయితే ఇప్పుడు అతను తమ డబ్బు తిరిగి ఇవ్వకుండా తమనే బెదిరిస్తున్నాడని ఆరోపించారు. అతనిపై తగిన చర్యలు తీసుకుని, తమ డబ్బు ఇప్పించాలని అభ్యర్థించారు. 


Updated Date - 2021-06-17T13:32:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising