ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు రుణాలు మాఫీ.. సీఎం కీలక ప్రకటన..

ABN, First Publish Date - 2021-09-14T18:03:41+05:30

బంగారు రుణాలను మాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బడుగులకు ఊరట
  • సహకార బ్యాంకుల్లో రుణాల మాఫీ

చెన్నై/అడయార్‌ : రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో తీసుకున్న 5 సవర్లలోపు బంగారు రుణాలను మాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ 110వ నిబంధన కింద ప్రకటన చేశారు. సహకార బ్యాంకుల్లో 5 సవర్లలోపు బంగారు నగలపై రుణాలు తీసుకున్నవారికి ఊరట కల్పిస్తామని, ఆ మేరకు రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా తాము హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఆ మేరకు ఆ రుణ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు.


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలను గత నెల రోజులుగా సేకరించామని,. ఇందులో భాగంగా ఒక కుటుంబంలో సభ్యుడు తీసుకున్న రుణాలు, తీసుకున్న సహకార బ్యాంకు పేరు, రుణం తీసుకున్న తేదీ, మొత్తం రుణం,  క్రమ సంఖ్య, రేషన్డ్‌, ఆధార్‌ కార్డు నంబరు ఇలా 51 రకాల వివరాలను సేకరించినట్టు తెలిపారు. వాటినన్నింటినీ కంప్యూటరీకరణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా, 2011లో పంట రుణాల మాఫీలో లబ్ధి పొందిన వారి వివరాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగిందన్నారు. ఈ వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత 5 సవర్ల లోపు బంగారపు రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇలా రుణాలు మాఫీ చేయడం వల్ల ప్రభుత్వంపై రూ.6 వేల కోట్ల మేరకు ఆర్థిక భారం పడుతుందన్నారు. అదేసమయంలో సహకార బ్యాంకులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకు నేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సీఎం స్టాలిన్‌ హామీ ఇచ్చారు.

Updated Date - 2021-09-14T18:03:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising