ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టిలో బంగారం నిల్వలు... గడ్డపారలతో గ్రామస్థుల పరుగులు...

ABN, First Publish Date - 2021-03-07T20:04:34+05:30

నచ్చినవాళ్లని ఆత్మీయంగా బంగారం అని పిలుచుకుంటాం. అలాంటిది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రతి ఒక్కరికీ బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. కనీసం ఒక బంగారు నగనైనా ధరించాలని కోరుకుంటారు. అలాంటిది నిజంగా బంగారు కొండ కనిపిస్తే ఇక ఆగగలమా? కాంగోలోని సౌత్ కివు ప్రావిన్స్‌లో ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఓ కొండలోని మట్టిలో దాదాపు 90 శాతం వరకు బంగారం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో లుహిహిలోని ఆ కొండ దగ్గరికి ఆ పరిసరాల్లోని ప్రజలు గడ్డపారలతో పోటెత్తారు. సాధ్యమైనంత ఎక్కువ బంగారాన్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. 


ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ అల్గోబరీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో లుహిహిలోని కొండ దగ్గరికి భారీగా జనం ఆత్రుతగా వెళ్తుండటం కనిపించింది. కొందరు గడ్డపారలతో ఈ కొండను తవ్వుతుండగా, మరికొందరు కేవలం చేతులతోనే మట్టిని తవ్వుతున్నారు. వీరు ఈ మట్టిని తమ ఇళ్ళకు తీసుకెళ్ళి, బంగారాన్ని సేకరిస్తున్నారని అహ్మద్ ట్వీట్ చేశారు. 


సౌత్ కివు గనుల శాఖ మంత్రి వెనంట్ బురుమె ముహిగిర్వా మాట్లాడుతూ, ఈ గ్రామం చాలా చిన్నదని, ఇక్కడ బంగారు కొండ ఉందని తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. ప్రజలు భారీ ఎత్తున వస్తుండటంతో ఈ కొండను తవ్వడాన్ని నిషేధించినట్లు తెలిపారు. 


కాంగోలో టింబర్, వజ్రాలు, ఖనిజాల నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. వీటిని స్థానికులు చిన్న చిన్న పరికరాలతో తవ్వుకోవడం సర్వసధారణ విషయమే. 


Updated Date - 2021-03-07T20:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising