ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవాలో అత్యధిక పాజిటివిటీ రేటు.. దేశంలోనే తొలి స్థానంలో..

ABN, First Publish Date - 2021-05-12T23:52:22+05:30

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 21 శాతానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పానాజి: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 21 శాతానికి పెరిగింది. అనేక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక ఇటీవలి కాలంలో గోవాలో కూడా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఐసీఎంఆర్‌ స్వయంగా వెల్లడించింది. దేశంలోని పాజిటివిటీ రేటు కంటే గోవాలో అత్యధికంగా 48 శాతంగా పాజిటివిటీ రేటు ఉందని, అంతేకాదు దేశంలోనే అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతంగా ప్రస్తుతం గోవా నిలవడం ఆందోళన కలిగిస్తోందని ఐసీఎంఆర్ వెల్లడించింది. 


కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తొలి స్థానంలో ఉందని, ఆ తరువాతి స్థానాల్లో పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, హరియాణా, కర్ణాటక ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది. దేశ పాజిటివిటీ రేటు సరాసరి(21%) కంటే ఎక్కువగా ఉందని, అయితే గోవాలో మాత్రమే కరోనా పాజిటివిటీ రేటు దాదాపు 48 శాతం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే గోవాలో లాక్‌డౌన్ విధించేందుకు కేంద్రం తాజాగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కూడా సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-05-12T23:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising