ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ముందు బీజేపీకి షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కార్లోస్ రాజీనామా

ABN, First Publish Date - 2021-12-21T23:21:56+05:30

ఫిబ్రవరిలో 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం గోవాలో భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉంది. ఇన్నాళ్లు ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలందరినీ తమ వైపుకు తిప్పుకుని టీఎంసీ ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనాజీ: కొద్ది రోజుల్లో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్ ఎదురైంది. ఆ పార్టీ నేత గోవా శాసనసభ సభ్యుడు కార్లోస్ అల్మీడా రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు మంగళవారం ఆయన ప్రకటించారు. తన రాజీనామాను అసెంబ్లీ సెక్రెటరీ నర్మత ఉల్మాన్‌కు అందించారు.


ఫిబ్రవరిలో 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం గోవాలో భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉంది. ఇన్నాళ్లు ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలందరినీ తమ వైపుకు తిప్పుకుని టీఎంసీ ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోంది. ఇప్పటికే టీఎంసీ పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి తరుణంలో కార్లోస్ రాజీనామాపై కొన్ని ప్రశ్నలు వెలువడుతున్నాయి. బీజేపీకి రాజీనామా అనంతరం ఆయన టీఎంసీలో చేరతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-12-21T23:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising