ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికార రహస్యాలను జర్నలిస్ట్‌కు ఇవ్వడం నేరం : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2021-01-20T00:08:23+05:30

సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాట్స్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అధికార రహస్యాలను జర్నలిస్ట్‌కు ఇవ్వడం నేరమని, ఈ సమాచారాన్ని ఇచ్చినవారు, పుచ్చుకున్నవారు శిక్షార్హులని, వారు జైలుకు వెళ్లక తప్పదని పేర్కొన్నారు. 


రాహుల్ గాంధీ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బాలాకోట్‌పై జరిగిన వైమానిక దాడుల సమాచారం ముందుగానే అర్నాబ్ గోస్వామికి తెలిసిందని వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఈ సమాచారం కేవలం ఐదుగురికి మాత్రమే తెలుస్తుందన్నారు. ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, హోం మంత్రి, వాయు సేన చీఫ్, జాతీయ భద్రతా సలహాదారులకు మాత్రమే బాలాకోట్ వైమానిక దాడుల గురించి తెలుస్తుందన్నారు. ఇటువంటి సమాచారాన్ని యుద్ధ విమానం పైలట్‌కు సైతం ఇవ్వరన్నారు. ఈ ఐదుగురిలో ఒకరు ఆ సమాచారాన్ని ఈ వ్యక్తికి ఇచ్చి ఉంటారని పేర్కొన్నారు. ఇది క్రిమినల్ చర్య అని చెప్పారు. ఆ పని చేసిందెవరో మనం తెలుసుకోవాలన్నారు. ఈ సమాచారాన్ని ఇచ్చినవారు, పుచ్చుకున్నవారు జైలుకు వెళ్లాలన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని, అయితే అది ప్రారంభం కాదని, ఎందుకంటే దానిని ప్రధాన మంత్రే ఇచ్చి ఉంటారని అన్నారు. 


వీళ్లంతా తాము దేశభక్తులమని చెప్పుకుంటారని, వాయు సేనను ఇబ్బందుల్లోకి నెట్టడం దేశభక్తి కాదని అన్నారు. దాడుల వల్ల రాజకీయ ప్రయోజనాలు పొందడం దేశభక్తి కాదన్నారు. అర్నాబ్ గోస్వామికి ఈ విషయం తెలిసిందంటే, అది ఆయన వాట్సాప్‌లో ఉంటే, ఆ విషయం పాకిస్థాన్‌కు కూడా తెలిసే ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. దీనిపై దర్యాప్తు ప్రారంభం కావాలన్నారు. 


పుల్వామా దాడికి ప్రతీకారంగా...

2019 ఫిబ్రవరి 14న జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకు భారత ప్రభుత్వం బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిపింది. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి. 


Updated Date - 2021-01-20T00:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising