ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court: కన్వర్ యాత్రను రద్దు చేయండి

ABN, First Publish Date - 2021-07-16T17:56:23+05:30

కోవిడ్-19 నేపథ్యంలో కన్వర్ యాత్రను రద్దు చేయాలని యూపీతో పలు రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకురావడాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోవిడ్-19 నేపథ్యంలో కన్వర్ యాత్రను రద్దు చేయాలని యూపీతో పలు రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకురావడాన్ని అనుమతించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. నిర్దేశిత ప్రాంతాల్లో శివాభిషేకాలకు గంగాజలాన్ని ట్యాంకర్ల ద్వారా ఏర్పాటు చేయాలని సూచించింది. జీవించే హక్కు కంటే మత విశ్వాసాలేమీ ముఖ్యం కాదని కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కరోనా థర్డ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో కన్వర్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 


ఇదిలా ఉంటే, కన్వర్ యాత్రపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ సందర్భంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. హరిద్వార్ నుంచి గంగాజలం తీసుకురావడానికి కన్వరియాలకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్రాలకు సూచించినట్టు కేంద్రం తెలిపింది. అయితే మతవిశ్వాసాలను అనుసరించి ట్యాంకర్ల ద్వారా గంగాజలం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు పేర్కొంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆ నీటినే సమీపంలో శివాలయాల్లో అభిషేకానికి వినియోగించుకోవలసిందిగా సూచించామని తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గంగాజలం పంపిణీ చేసుకోవలసిందిగా భక్తులకు సూచించినట్టు సుప్రీం కోర్టుకు తెలిపింది. 

Updated Date - 2021-07-16T17:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising