రిటైరయ్యే దాకా పూర్తి జీతం
ABN, First Publish Date - 2021-05-26T08:46:16+05:30
తమ ఉద్యోగుల్లో కొవిడ్‌తో కన్నుమూసిన వారి కుటుంబాలకు అండగా నిలవనున్నట్లు టాటా స్టీల్ ప్రకటించింది. ఉద్యోగ కాలం ముగిసే వరకు మృతుల జీతాలను వారి కుటుంబాలకు
కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు టాటా స్టీల్ అండ
గృహ, వైద్య ప్రయోజనాలు కూడా..
న్యూఢిల్లీ, మే 25: తమ ఉద్యోగుల్లో కొవిడ్‌తో కన్నుమూసిన వారి కుటుంబాలకు అండగా నిలవనున్నట్లు టాటా స్టీల్ ప్రకటించింది. ఉద్యోగ కాలం ముగిసే వరకు మృతుల జీతాలను వారి కుటుంబాలకు అందిస్తామని స్పష్టం చేసింది. ‘‘జీతాలతో పాటు.. గృహ, వైద్య ప్రయోజనాలను మృతుల పదవీ విరమణ వయసు వరకు అందించనున్నాం. కరోనా వారియర్స్‌గా చేసి మృతిచెందిన ఉద్యోగుల బిడ్డలు పట్టభద్రులయ్యేవరకూ వారి విద్యాభ్యాస ఖర్చులు భరిస్తాం.
ఈ దారుణ పరిస్థితుల్లో ఉద్యోగుల మృతి పట్ల టాటా స్టీల్ తీవ్ర ఆవేదనను, సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. వారి కుటుంబ భద్రత, సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం’’ అని ట్విటర్‌లో టాటా స్టీల్ ప్రకటించింది. గత వారం ఓయో రూమ్స్ సైతం.. కరోనాతో కన్నుమూసిన తమ ఉద్యోగుల కుటుంబాలకు 8నెలల జీతాన్ని, వారి పిల్లల విద్యాభ్యాసానికి ఐదేళ్ల పాటు అయ్యే ఖర్చును భరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Updated Date - 2021-05-26T08:46:16+05:30 IST