ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తాలిబన్లను నమ్మలేం.. భారత్ సాయం చేయాలి’

ABN, First Publish Date - 2021-08-18T07:11:23+05:30

తాలిబన్లను నమ్మలేమని, వాళ్లు చెప్పిన మాటలు నమ్మకూడదని పంక్థూన్ స్వాతంత్ర సమరయోధుడు, ‘సరిహద్దు గాంధీ’గా పేరు పొందిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలకత్తా: తాలిబన్లను నమ్మలేమని, వాళ్లు చెప్పిన మాటలు నమ్మకూడదని పంక్థూన్ స్వాతంత్ర సమరయోధుడు, ‘సరిహద్దు గాంధీ’గా పేరు పొందిన అబ్దుల్ గఫార్ ఖాన్ మనుమరాలు యాస్మిన్ నిగర్ ఖాన్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు సాయం అందించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర దేశాలను అర్థించారు. ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన తాలిబన్లు ఇటీవలే అధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాస్మిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. 


అందులో.. ‘తాలిబన్లను నమ్మలేం. వాళ్లు ఈ రోజు ఒకటి చెప్పి.. ఆ మరుసటి రోజే మరొకటి చేస్తారు. ఆ దేశ నేతలంతా దేశం వదిలి పారిపోయారు. అక్కడి సామాన్య ప్రజలే ఇరుక్కుపోయారు. అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం యుద్ధం కూడా చేయకుండా తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం అక్కడి ప్రజలంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. వారికి సాయం చేయండి’ అని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను వేడుకున్నారు. కాగా.. పక్థూన్ జిర్గే ఈ హింద్ పార్టీకి అధ్యక్షురాలైన యాస్మిన్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో నివశిస్తున్నారు.

Updated Date - 2021-08-18T07:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising