ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marchలోగా లక్షమంది రైతులకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు

ABN, First Publish Date - 2021-10-24T13:24:33+05:30

వచ్చే యేడాది మార్చిలోపున అర్హులైన లక్షమంది రైతులకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్ట్లు విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ ప్రకటించారు. కోయంబత్తూరు కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటైన ప్రత్యేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - మంత్రి సెంథిల్‌ బాలాజీ ప్రకటన


చెన్నై(Tamilnadu): వచ్చే యేడాది మార్చిలోపున అర్హులైన లక్షమంది రైతులకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్ట్లు విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ ప్రకటించారు. కోయంబత్తూరు కలెక్టర్‌  కార్యాలయంలో ఏర్పాటైన ప్రత్యేక సభలో రైతులకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు పత్రాలు, విద్యుత్‌ బోర్డులో కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగుల వారసులకు నియామకపత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సెంథిల్‌బాలాజీ ప్రసంగిస్తూ ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో లక్షమంది రైతులకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారని, ఆ మేరకు అర్హులైన రైతులను గుర్తించే పనులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో గత 20 యేళ్లుగా 4.52 మంది రైతులు ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వీరిలో లక్ష మందికి మార్చిలోపున ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నామని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-10-24T13:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising