ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్ కేసుల ఎఫెక్ట్: ప్రాన్స్‌లో మళ్లీ Work From Home

ABN, First Publish Date - 2021-12-28T13:47:14+05:30

ఒమైక్రాన్ కేసుల పెరుగుదలతో ఫ్రాన్స్ దేశంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్: ఒమైక్రాన్ కేసుల పెరుగుదలతో ఫ్రాన్స్ దేశంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధించారు. కొవిడ్ ఒమైక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదలతో ఉద్యోగులకు వీలైనప్పుడల్లా వర్క్ ఫ్రం హోమ్ విధించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం కంపెనీలను ఆదేశించిందని ఆ దేశ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ తెలిపారు.ఫ్రాన్స్ దేశంలో శనివారం ఒక్క రోజే లక్ష కొవిడ్ కేసులు వెలుగుచూశాక ప్రధానమంత్రి జీన్ కాస్టెక్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.రెస్టారెంట్లు, సినిమాహాళ్లలో రెండు డోసుల టీకాలు వేసుకున్న వ్యక్తులకే ప్రవేశం ఉంటుందని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. నూతన సంవత్సర వేడుకలు జరగకుండా కర్ఫ్యూను విధించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పలు ఆంక్షలు విధించారు.


 బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్కులు ధరించాలని కోరారు.కచేరీలు, క్రీడల పోటీలు, ఇతర ఈవెంట్లలో 5వేల మందికి పరిమితి విధించారు. ప్రజలు బూస్టర్ డోసులు పొందాలని ప్రధాని కోరారు. కొవిడ్ కేసుల పెరుగుదలతో విద్యార్థులకు సెలవులను పొడిగించారు. సినిమాహాళ్లు, క్రీడల మైదానాలు, బస్సులు, రైళ్లలో తినడం, తాగడాన్ని నిషేధించారు.


Updated Date - 2021-12-28T13:47:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising