ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covishield తీసుకున్న భారతీయులకు మరో గుడ్‌న్యూస్!

ABN, First Publish Date - 2021-07-18T00:47:23+05:30

కొవిషీల్డ్ తీసుకున్న భారతీయులకు మరో గుడ్ న్యూస్! ఈ టీకా తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతిస్తామని ఫ్రాన్స్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్: కొవిషీల్డ్ తీసుకున్న భారతీయులకు మరో గుడ్ న్యూస్! ఈ టీకా తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతిస్తామని ఫ్రాన్స్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కొవిషీల్డ్‌ను గుర్తిస్తున్నట్టు పేర్కొంది. దీంతో..కొవిషీల్డ్‌ను అనుమతిస్తున్న దేశాల జాబితాలోకి ఫ్రాన్స్‌ కూడా వచ్చి చేరింది. ప్రస్తుతం 40 పైగా దేశాలు కొవిషీల్డ్ టీకా తీసుకున్నవారిని అనుమతిస్తున్నాయి. 


బ్రిటన్ కంపెనీ ఆస్ట్రాజెనెకా అనుమతితో ‘సీరం’ భారత్‌లో రూపొందిస్తున్న కొవిషీల్డ్ టీకాకు ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ గుర్తింపు లభించని విషయం తెలిసిందే. ఈ గుర్తింపు లేని కరోనా టీకాలు తీసుకున్న వారికి గ్రీన్ పాస్ లభించదు. దీంతో..వారు ఐరోపాకు వెళ్లడం అసంభవమైపోయింది. కరోనా టీకాలు తీసుకున్న వారినే ఐరోపాలోకి అనుమతించాలనే ఉద్దేశ్యంతో అక్కడి దేశాలు గ్రీన్ పాస్ విధానాన్ని రూపొందించాయి. ఈ క్రమంలో కొన్ని కరోనా టీకాలకు మాత్రమే ఈ గుర్తింపును ఇచ్చాయి. ఇక ఆస్ట్రాజెనెకాకు ఈ గుర్తింపు లభించకపోవడంతో భారత్‌లో పెద్ద ఎత్తున నిరసనలు రేగాయి. దీంతో మెట్టుదిగిన పలు ఐరోపా దేశాలు ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారిని కూడా అనుమతించడం ప్రారంభించాయి. ఈ దేశాల జాబితాలోకి తాజాగా ఫ్రాన్స్ కూడా వచ్చి చేరింది.

Updated Date - 2021-07-18T00:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising