ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి, బాలుడి దుర్మరణం

ABN, First Publish Date - 2021-08-13T21:02:49+05:30

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో నాలుగేళ్ల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. గురువారం రాత్రి ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు. బీజేపీ నేత జస్బీర్ సింగ్, ఆయన తల్లిదండ్రులు, మరో ముగ్గురు బంధువులు గాయపడినట్టు తెలిపారు. 36 ఏళ్ల సింగ్‌తో పాటు ఆయన ఐదుగురు కుటుంబ సభ్యులు గాయపడగా, ఇద్దరిని చికిత్స కోసం జమ్మూ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. మృతుడిని జస్బీర్ మేనల్లుడుగా గుర్తించారు. దాడి విషయం తెలియగానే భద్రతా బలగాలు హుటాహుటిని ఘటనా స్థలికి చేరుకుని అగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

 

కాగా, అగంతకుల గ్రెనేడ్ దాడిని బీజేపీ నేత తరుణ్ చగ్ ఖండించారు. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులే ఈ దాడికి పాల్పడ్డారని, ఇది పరికిపందల చర్య అని అన్నారు. దాడికి బాధ్యులైన వారిని తక్షణం పోలీసులు అరెస్టు చేయాలని బీజేపీ జేకే విభాగం నేత రవీందర్ రైనా అన్నారు. అమాయక బాలుడి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారని, ఆరుగురు గాయపడ్డారని, దాడికి పాల్పడిన వారు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాలని పేర్కొన్నారు. రాజకీయ నేతలు టార్గెట్‌గా ఈ దాడులు జరుగుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే కశ్మీర్‌లోయలోని అనంతనాగ్‌లో ఒక బీజేపీ నేతను, అతని భార్యను దుండగలు నాలుగు రోజుల క్రితం కాల్చిచంపారు.

Updated Date - 2021-08-13T21:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising