ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ నుంచి వచ్చిన కార్గో షిప్‌లో 14 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-05-05T15:20:01+05:30

భారతదేశం నుంచి డర్బన్‌కు ప్రయాణించిన కార్గో షిప్‌లోని 14మంది సిబ్బందికి పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్ అని వచ్చినట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా): భారతదేశం నుంచి డర్బన్‌కు ప్రయాణించిన కార్గో షిప్‌లోని 14మంది సిబ్బందికి పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్ అని వచ్చినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన ట్రాన్స్‌నెట్ నేషనల్ పోర్ట్ అథారిటీ తెలిపింది.కాగా సరుకుల రవాణా ఓడలో ఉన్న ఒక చీఫ్ ఇంజినీరు కరోనాతో కాకుండా గుండెపోటుతో మరణించారని  ట్రాన్స్‌నెట్ ప్రతినిధి చెప్పారు. సరుకులతో కూడిన ఓడలో సిబ్బందికి వైద్యపరీక్షలు చేయగా వారిలో 14 మందికి పాజిటివ్ అని రావడంతో వారిని క్వారంటైన్ లో ఉంచారు. కరోనా రోగులున్న కార్గో నౌకను దిగ్బంధంలో ఉంచామని, ఈ ఓడలోకి వెళ్లడానికి ఎవరికీ ప్రవేశం లేదని  ట్రాన్స్‌నెట్ ప్రతినిధి చెప్పారు.


 ఈ నౌకలో 200 మంది పోర్టు ఉద్యోగులు 3వేల టన్నుల బియ్యాన్ని ఆఫ్  లోడ్ చేశారని ఓ పోర్టు అధికారి చెప్పారు. బియ్యం ఆఫ్ లోడింగ్ చేసిన కూలీలు తమకు కరోనా సోకుతుందేమోనని భయపడుతున్నారు. ఫిలిప్పీన్స్ సిబ్బంది ఉన్న కార్గో నౌక డర్బన్ నౌకాశ్రయానికి చేరిన తర్వాత సిబ్బందికి కరోనా ఉందని తేలింది. 

Updated Date - 2021-05-05T15:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising