ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ABN, First Publish Date - 2021-10-19T18:45:20+05:30

ఆర్థిక అభివృద్ధికే కాకుండా రైతుల అభివృద్ధికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శ్రమిస్తోందని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ఖురానా పేర్కొన్నారు. తాలూకాలోని ఆలగొండహళ్లిలో సోమవారం ఏర్పాటు చేసిన బరోడా రైతు దినోత్సవంలో పాల్గొ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

            - బ్యాంకు ఆఫ్‌ బరోడా ఈడీ అజయ్‌ ఖురానా 


హొస్కోటె(karnataka): ఆర్థిక అభివృద్ధికే కాకుండా రైతుల అభివృద్ధికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శ్రమిస్తోందని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ఖురానా పేర్కొన్నారు. తాలూకాలోని ఆలగొండహళ్లిలో సోమవారం ఏర్పాటు చేసిన బరోడా రైతు దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా రైతు దినోత్సవాలను ఆచరిస్తోందన్నారు. ఈనెల 16న విశ్వఆహార దినోత్సవానికి లాంఛనంగా శ్రీకారం చుట్టామని, దశలవారీగా రైతులను గౌరవించే కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు. బ్యాంకులు కేవలం రుణాలు ఇవ్వడం, వసూలు చేయడమే కాదని ఇంటి ముంగిటకే బ్యాంకు సేవలు అందించడం ద్వారా రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రాంతీయ మేనేజర్‌ సుధాకర్‌ నాయక్‌ మాట్లాడుతూ సాంకేతికంగా ముందంజలో సాగుతుండడంతో ఈ దిశగా డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావడం ద్వారా సమాజంలోని ప్రధాన జనజీవన స్రవంతిలోకి చేరాలన్నారు. సకాలంలో రుణాలను చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ పథకాలకింద రైతులకు రుణాలు పంపిణీ చేశారు. వ్యవసాయంలో రాణించిన రైతులను సన్మానించారు. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డు డైరెక్టర్‌ నటరాజ్‌, రూరల్‌ నియోజకవర్గ జనరల్‌ మేనేజర్‌ మనీశ్‌ ప్రసాద్‌, వ్యవసాయ శిబిరం ముఖ్యులు ఉదయ్‌హెగ్డే పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T18:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising