ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్ మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా కరోనాతో మృతి

ABN, First Publish Date - 2021-05-20T14:33:41+05:30

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో మరణించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో మరణించారు. 89 ఏళ్ల వయసున్న జగన్నాథ్ పహాడియా ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మరణించారు. జగన్నాథ్ భార్య కూడా ఆసుపత్రిలో చేరారు. 1980-81 లలో రాజస్థాన్ సీఎంగా పనిచేశారు.హర్యానా, బీహార్ రాష్ట్రాల గవర్నరుగా కూడా పనిచేసిన జగన్నాథ్ సీనియర్ కాంగ్రెస్ నేత. జగన్నాథ్ కరోనాతో మరణించడం నన్ను దిగ్ర్బాంతికి గురిచేసింది, జగన్నాథ్ కు తనపై ఎంతో ప్రేమ చూపించే వారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జగన్నాథ్ మృతికి సంతాప సూచకంగా గురువారం రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో జగన్నాథ్ అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. మాజీ సీఎంకు సంతాపం తెలిపేందుకు రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పహాడియా రాజస్థాన్ రాష్ట్ర మొట్టమొదటి దళిత సీఎంగా నిలిచారు. 

Updated Date - 2021-05-20T14:33:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising