ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi వల్లే మణిపూర్ ప్రశాంతంగా ఉంది : సీఎం బిరేన్ సింగ్

ABN, First Publish Date - 2021-08-01T18:29:32+05:30

ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంతంపై అధిక శ్రద్ధ వహిస్తున్నారని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ అన్నారు. ఈశాన్య ప్రాంతానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంతంపై అధిక శ్రద్ధ వహిస్తున్నారని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ అన్నారు. ఈశాన్య ప్రాంతానికి చెందిన ఐదుగురిని తాజాగా కేబినెట్‌లోకి తీసుకోవడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, ఈ విషయంపై తాము కొన్ని రోజుల క్రిందటే ప్రకటన చేశామని గుర్తు చేశారు. మణిపూర్ పీసీసీ మాజీ అధ్యక్షుడు గోవిందదాస్ ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం పై వ్యాఖ్యలు చేశారు. గతంలో మణిపూర్‌లో నిత్యం ఉద్యమాలు జరుగుతూ ఉండేవని, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే మణిపూర్ శాంతియుతంగా మారిందని అన్నారు. ‘‘నేను కూడా కాంగ్రెస్‌లో పనిచేశా. కానీ... డ్రైవర్ నిద్రపోతే... బండిని ఎవరు నడుపుతారు... బండి ఎలా ముందుకు కదులుతుంది?’’ అంటూ సీఎం బిరేన్ సింగ్ పరోక్షంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.  

బీజేపీలో చేరిన మాజీ పీసీసీ చీఫ్

మణిపూర్ మాజీ పీసీసీ చీఫ్ గోవింద్ దాస్ ఆదివారం బీజేపీలో చేరారు. సీఎం బిరేన్ సింగ్‌తో పాటు జాతీయ నేతల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో చీఫ్ విప్‌గా కూడా కొనసాగారు. 

Updated Date - 2021-08-01T18:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising