ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి లాయర్ అరెస్టు

ABN, First Publish Date - 2021-09-02T19:03:35+05:30

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ న్యాయవాది ఆనంద్ డగాను సీబీఐ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ న్యాయవాది ఆనంద్ డగాను సీబీఐ అరెస్టు చేసింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై హైకోర్టు ఆదేశించిన ప్రాథమిక దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారన్న కారణంగా ఆయనను అరెస్టు చేసి ట్రాన్సిట్ రిమాండ్‌పై ఢిల్లీకి తీసుకు వస్తున్నారు. ఆయనతో పాటు బుధవారం రాత్రి కస్టడీలో తీసుకున్న సీబీఐ సబ్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ తివారీని కూడా కోర్టు ముందు హాజరుపరచనున్నారు. డగా నుంచి లంచం తీసుకున్న ఆరోపణలపై తివారీని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.


అక్రమ ముడుపుల వ్యవహారంలో సిబీఐ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, నాగపూర్‌‌కు చెందిన అడ్వకేట్, గుర్తుతెలియని మరికొందరిపై సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగాగానే సబ్ ఇన్‌స్పెక్టర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. దేశ్‌ముఖ్‌కు క్లీన్ చిట్ ఇచ్చినట్టు పేర్కొంటూ ప్రాథమిక దర్యాప్తు నివేదక శనివారం రాత్రి లీక్ కావడం సీబీఐ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపి, ప్రాథమిక దర్యాప్తును ప్రభావితం చేసినట్టు గుర్తించింది. 

Updated Date - 2021-09-02T19:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising