ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త పార్టీ 'అప్నా భారత్ మోర్చా' ఆవిర్భావం

ABN, First Publish Date - 2021-02-26T15:05:35+05:30

హర్యానా కాంగ్రెస్ మాజీ నేత అశోక్ తన్వర్ 'అప్నా భారత్ మోర్చా' అనే కొత్త పార్టీని లాంఛనంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హర్యానా కాంగ్రెస్ మాజీ నేత అశోక్ తన్వర్ 'అప్నా భారత్ మోర్చా' అనే కొత్త పార్టీని లాంఛనంగా ఢిల్లీలో ప్రారంభించారు. పార్టీ ప్రారంభ కార్యక్రంలో త్రిపుర కాంగ్రెస్ మాజీ నేత కీరిత్ ప్రత్యుద్ దేబ్ బర్మన్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ తన్వర్ మాట్లాడుతూ, దేశం కోసం పని చేయాలనే కృతనిశ్చయంతోనే పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడాలనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కార్టూనిస్టు ఆర్‌కే లక్ష్మణ్ ఒక సందర్భంలో నిజమైన కాంగ్రెస్ వరుస చీలికలతో చిన్నదైపోయిందని చెప్పరని, ఈరోజు అదే నిజమైందని పేర్కొన్నారు.


'డైలాగ్, డిబేట్, డిస్కషన్' అనే మూడు సూత్రాల ఆధారంగా తమ పార్టీ పని చేస్తుందని అశోక్ తన్వర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మౌలిక సిద్ధాంతాల నుంచి దూరమైందంటూ 2019 అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం దుష్యంత్ చౌతాలా 'జననాయక్ జనతా పార్టీ' (జేజేపీ)కి మద్దతిచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారు.

Updated Date - 2021-02-26T15:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising