ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా పిల్లల్ని క్షమించండి...యోగి సర్కారుకు Kashmiri కుటుంబాల విజ్ఞప్తి

ABN, First Publish Date - 2021-10-30T17:22:49+05:30

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు తమ పిల్లలను క్షమించి విడుదల చేయాలని ముగ్గురు కశ్మీరీ యువకుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు తమ పిల్లలను క్షమించి విడుదల చేయాలని ముగ్గురు కశ్మీరీ యువకుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. భారత్ -పాక్ టీ 20 క్రికెట్ మ్యాచ్ లో పాక్ గెలిచినందుకు కశ్మీరుకు చెందిన షౌకత్ అహ్మద్ గనై, అర్షద్ యూసుఫ్, ఇనియత్ అల్తాఫ్‌లు సంబరాలు చేసుకున్నారని యూపీ పోలీసులు వారిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ముగ్గురు కశ్మీరీ యువకులు పీఎం స్పెషల్ స్కాలర్ షిప్ తో ఆగ్రా నగరంలోని రాజా బల్వంత్ సింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు.మహ్మద్ షాబాన్ గనై కుమారుడు షౌకత్ బీటెక్ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నాడు.


‘‘భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత అతన్ని అరెస్టు చేసి ఆగ్రా సెంట్రల్ జైలులో ఉంచారు. ఏం జరిగిందో మాకు తెలియదు. మా కుమారులు ఏదైనా తప్పు చేసి ఉంటే, వారి తరపున మేము అధికారులకు క్షమాపణలు చెబుతున్నాం. వారి కెరీర్ నాశనం కాకుండా ఉండేందుకు వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని తెలిపారు.షౌకత్ ను విడుదల చేయాలని అతని తల్లి అభ్యర్థించింది.షౌకత్, మరో ఇద్దరు విద్యార్థులను విడుదల చేయాలని జమ్మూకశ్మీరుకు చెందిన విద్యార్థుల కుటుంబసభ్యులు వేడుకున్నారు.షౌకత్ బందిపొరా జిల్లా వాసి. యూసుఫ్, అల్తాఫ్ లు బుద్గాం జిల్లా వాసులు.




 యూసుఫ్ కు వితంతువు. ఆయనది పేద కుటుంబం.‘‘ యూసుఫ్ మా జీవనోపాధికి చివరి ఆశ. మేం అతని తరపున అధికారులకు క్షమాపణలు కోరుతున్నాం, అతన్ని విడుదల చేయమని వారిని కోరుతున్నాం’’అని తల్లి పేర్కొంది.మానవతా ద్పక్పథంతో యూసుఫ్, ఇద్దరు విద్యార్థులను విడుదల చేయాలని వారి కుటుంబసభ్యులు కోరారు.జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ముగ్గురు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. కళాశాల అధికారులు ఈ విద్యార్థులకు క్లీన్ చిట్ ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి నినాదాలు చేయలేదని ధ్రువీకరించారు.


Updated Date - 2021-10-30T17:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising