ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీ సాయం.. విమానాశ్రయాల్లోనే!

ABN, First Publish Date - 2021-05-05T07:57:14+05:30

విదేశాల నుంచి భారతదేశానికి పలు రకాలుగా సాయం అందుతోంది! ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, అత్యవసర ఔషధాలు (ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌).. ఇలా చాలానే వస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆరోపణలు, విమర్శలపై కేంద్రం వివరణ


న్యూఢిల్లీ, మే 4: విదేశాల నుంచి భారతదేశానికి పలు రకాలుగా సాయం అందుతోంది! ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, అత్యవసర ఔషధాలు (ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌).. ఇలా చాలానే వస్తున్నాయి. కానీ, తీరా అవి దేశానికి వచ్చాక కస్టమ్స్‌ విభాగం వద్దనే ఉండిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రవాణా సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమని కొందరు అధికారులు చెబుతున్నారు. అయితే పరిపాలనలో పారదర్శకత లేకపోవడం, రెడ్‌ టేపిజం వల్లే ఈ దుస్థితి తలెత్తుతోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. సోమవారం ఢిల్లీ హైకోర్టులో కూడా ఒక ఆస్పత్రి ఈ నిర్లక్ష్యం గురించి ప్రస్తావించింది. పెద్ద సంఖ్యలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ఇప్పటికిప్పుడు కావాల్సిన ప్రాణాధార మందులు కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ వద్ద ఉన్నాయని కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలు, విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. కొవిడ్‌ సంబంధిత వైద్య పరికరాలు, ఔషధాల అనుమతులకు సంబంధించి ఎలాంటి పెండింగులూ లేవని స్పష్టం చేసింది. ‘‘కస్టమ్స్‌ విభాగం కొవిడ్‌ సంబంధిత సరుకులకు ప్రథమప్రాధాన్యమిచ్చి బయటకు పంపేస్తున్నారు. అంతేకాదు.. కస్టమ్స్‌ శాఖ ఆ వస్తువులపై బేసిక్‌ డ్యూటీని, ఆరోగ్య సుంకాన్ని ఎత్తివేశాయి. విదేశాల నుంచి వచ్చే ఆయా పరికరాలు, ఔషధాలను ఇక్కడ రెడ్‌ క్రాస్‌ అందుకుంటుంది. ఆ సంస్థ ఆయా పరికరాలను, ఔషధాలను హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌కు (ఇది కేంద్ర ఆరోగ్య శాఖకు డిస్ట్రిబ్యూషన్‌ మేనేజర్‌) అందజేస్తుంది. హెచ్‌ఎల్‌ఎల్‌ వాటిని దేశంలోని పలు ప్రాంతాలకు విమానాల ద్వారా పంపిణీ చేస్తుంది. అలా పంపేముందు వాటిని సరిచూసుకునే ప్రక్రియ ఉంటుంది. దానికి కనీసం ఆరుగంటలపైగానే పడుతుంది. వివిధ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థలపై పడుతున్న భారం ఆధారంగా(అంటే కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు, తక్కువగా ఉన్న చోట్లకు ఎక్కడి అవసరాలకు తగినట్టుగా అక్కడికి) వాటిని పంపిస్తారు’’ అని కేంద్రం వెల్లడించింది. పీపీఈ కిట్లు, పల్స్‌ ఆక్సీ మీటర్లు, కాన్సంట్రేటర్లు, ఎన్‌95 మాస్కులు.. అన్నీ కలిపి మొత్తం 40 లక్షల వస్తువులను వివిధ రాష్ట్రాల్లోని 86 వ్యవస్థలకు పంపినట్టు వివరించింది.


Updated Date - 2021-05-05T07:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising